సరిహద్దుల్లో పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి

14 May, 2021 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవటంపై ఇప్పటికే తెలంగాణ అధికారులతో ఏపీ సీఎస్‌ ఆధిత్యనాథ్‌ చర్చలు జరిపారు. న్యాయపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ పరంగా వైద్యం ఎక్కడైనా చేయించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించిన సంగతిని ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. తెలంగాణ అధికారుల తీరు బాధాకరమని తెలిపింది.

కాగా, తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పోలీసులను వేడుకున్నా లోపలికి వెళ్లనివ్వటం లేదు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్‌ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. తెలంగాణ పోలీసులపై హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మధ్యాహ్నం 2:15 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

చదవండి : సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల

మరిన్ని వార్తలు