విజయవాడ‌ అగ్ని ప్రమాదం.. ప్రభుత్వం సీరియస్‌

9 Aug, 2020 11:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని ఓ  ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకున్న హోటల్లో ఆదివారం తెల్లవారుజామున  జరిగిన  ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది.  రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం ఓ హోటల్‌ను అద్దెకు తీసుకుని దాన్ని లాడ్జిగా మార్చి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. అయితే కరోనా పేషెంట్ల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు అధికారులు గుర్తించడంతో పాటు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ​ అగ్ని ప్రమాదం అనంతరం వివరాలను తెలుసుకునే క్రమంలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించినట్లు తేలింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రమాద ఘటనతో పాటు  అవతవకలపై విచారణకు ఆదేశించింది. (చదవండి : మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా)

ఈ ప్రమాదంలోని ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలసమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోవిడ్‌ బాధితులకు ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందిస్తోంది. ప్రమాద సమయంలో హోటల్‌‌లో 30 మంది భాధితులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. (చదవండి : ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌)

>
మరిన్ని వార్తలు