రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు

21 May, 2021 18:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు.

మరిన్ని వార్తలు