అంగన్‌వాడిలు ఇక ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ..

7 Jul, 2021 09:37 IST|Sakshi

సాక్షి,శ్రీకాకుళం: కార్పొరేట్‌ ప్లే స్కూళ్లకు దీటుగా పేదింటి చిన్నారులకు ఆంగ్ల విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను బలోపేతం చేస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను ప్రారంభించిన వైఎస్సార్‌ సీ పీ సర్కారు ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలను వైఎ స్సార్‌ ప్రీ ప్రైమరీస్కూళ్లుగా మార్చి మూడేళ్ల ప్రా యం నుంచే చిన్నారులకు ఏబీసీడీలు నేర్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్య మా దిరిగా పీపీ–1, పీపీ–2 తరగతులను అందుబాటులోకి తెచ్చారు.

 నూతన విద్యా విధానం ప్రకారం రూపొందించిన పాఠ్యపుస్తకాలను ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పంపిణీ చేశారు. 3–6 ఏళ్ల లోపు చిన్నారులకు ఆంగ్ల బోధన చేసేందుకు రూపొందించిన పా ఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన శిక్షణను ఇప్పటికే కార్యకర్తలకు అందజేశారు. 
ఒక్కో కిట్‌లో 8 పుస్తకాలు 
ఈ విద్యా సంవత్సరం నుంచే అంగన్‌వాడీ కేంద్రా ల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చే సేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం పీపీ–1, పీపీ–2 పాఠ్య పుస్తకాలు రూపొందించింది. ఆయా పుస్తకాల్లో ఆంగ్లం, తెలుగు, గణి త అక్షరాలు, చిన్నపాటి కథలను పాఠ్యాంశాలుగా పొందుపరిచింది. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను ఐసీడీఎస్‌ అధికారులు 4,191 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. కోవిడ్‌ తీవ్రత తగ్గి, కేంద్రాలు తెరిచిన తర్వాత వీటితోనే కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యను బోధించనున్నారు.

మూడేళ్లు నిండిన చిన్నారులకు పీపీ–1 పుస్తకాలు, నాలుగేళ్లు నిండిన వారికి పీపీ–2 పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్ర తి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్కో పీపీ–1, పీపీ–2 కిట్లను అందజేశారు. ఒక్కో కిట్‌లో 8 పుస్తకాలు చొ ప్పున ఉన్నాయి. ఆంగ్లం, తెలుగు, గణితం, ఆంగ్లం వర్క్‌బుక్, డ్రాయింగ్, యాక్టివిటీ తదితర సబ్జెక్టులు ఉన్న పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు రావ డం లేదు. రానున్న రోజుల్లో కేంద్రాలు తెరిస్తే ప్ర భుత్వం ఇచ్చిన పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి పాఠాలు చెప్పనున్నారు.    

మరిన్ని వార్తలు