ప్రజలకు ఏపీ గవర్నర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు 

14 Jan, 2023 07:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ శుభవేళ తెలుగు లోగిళ్లలో ఆనంద సిరులు వెల్లివిరియాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గవర్నర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు రాజ్‌భవన్‌ శుక్రవారం ప్రకటన జారీ చేసింది.

భోగి మంటలు, హరి దాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ధాన్యపు సిరులు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే తెలుగు పండుగ అని అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలన్నారు. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు