గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా

18 Sep, 2023 20:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు.

గవర్నర్‌ అస్వస్థత గురించి రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. 

వెంటనే గవర్నర్‌ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ ఆరా
గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడారు.గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు