28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ

29 Jan, 2021 14:48 IST|Sakshi

ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్‌

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీని నియమించింది. కమిటీ వీసీగా జేసీ (అభివృద్ధి), మెంబర్ కన్వీనర్‌గా గృహనిర్మాణ జిల్లా స్థాయి అధికారి.. సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, పంచాయతీరాజ్‌, కార్మిక, గనుల శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్‌ పద్ధతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు