ఉద్యోగ సంఘాలతో చర్చలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

24 May, 2022 16:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో జీపీఎస్‌పై చర్చించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఉద్యోగులను కోరామన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని గతంలో చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే సీపీఎస్‌ వల్ల నష్టం కలుగుతుందనే జీపీఎస్‌ ప్రతిపాదన తెచ్చామన్నారు. 

జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్‌ భద్రత కలుగుతుంది. సీపీఎస్‌ రద్దు వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు. కానీ ఓపీఎస్‌తో భవిష్యత్‌లో మోయలేని భారం పడుతుంది. అందుకే సీఎం జగన్‌ బాధ్యతగా భవిష్యత్‌ కోసం ఆలోచించారు. ఉద్యోగులకు నచ్చజెప్పి జీపీఎస్‌లో ఏమైనా అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చదవండి: (ఎక్కడికెళ్లినా మాతృభూమిని మర్చిపోకండి: గవర్నర్‌ హరిచందన్‌)

మరిన్ని వార్తలు