కందుకూరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందజేత

30 Dec, 2022 18:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘనటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందజేశారు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. శుక్రవారం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌లను కాకాణి ఆ కుటుంబాలకు అందజేశారు. 

కందుకూరు ఘటన దురదృష్టకరమన్న మంత్రి కాకాణి.. ఘటనపై దర్యాప్తు వీలైనంత త్వరగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు