Covid Vaccination in AP: వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్‌

1 Jun, 2021 17:15 IST|Sakshi

ఏపీలో కోటి మందికి పూర్తి వ్యాక్సినేషన్‌

కోటి మందికి కరోనా నుంచి రక్షణ

అమరావతి: కోవిడ్‌​ సంక్షోభ సమయం, వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలకు ఎదురీదుతూ ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్‌, సెకండ్‌​ డోసు టీకాలు అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి టీకాలు అందించింది. వ్యాక్సినేషన్‌లో దేశ సగటును దాటేసి ఏపీ దూసుకుపోతుంది. 

కోటి దాటారు
ఏపీలో ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో మొదటి, రెండో తీసుకున్నవారు 1,00,17,712 మందిగా ఉన్నారు. కేవలం మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 25,24,768గా ఉంది. 

ప్రత్యేక కృషి
కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టించడంతో  ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం జగన్‌ అప్రమత్తం చేశారు. అనునిత్యం సమీక్షలు నిర్వహిస్తూ కొవిడ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు.  కొవిడ్‌ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ  పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సకాలంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు వచ్చేలా వ్యూహం రచించారు. రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్లను ఆలస్యం చేయకుండా యుద్ధప్రతిపాదికన ప్రజలకు అందించారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోటి మందికి కరోనా నుంచి రక్షణ కల్పించగలిగారు. 

మరిన్ని వార్తలు