Fact Check: టీడీపీ అసత్య ప్రచారం.. అందులో వాస్తవం లేదు

18 Mar, 2023 07:25 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు జరగదు

పులివెందులలో టీడీపీకి అధిక ఓట్లు వచ్చాయని అసత్య ప్రచారం

ట్విట్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం వెల్లడి

సాక్షి, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పులివెందులలో అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని పేర్కొంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా నియోజకవర్గాల వారీగా జరగదని గుర్తుచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కింపు చేస్తారని స్పష్టంచేసింది. త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని, అసత్య వార్తలను నమ్మవద్దని కోరింది.
చదవండి: జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా

మరిన్ని వార్తలు