సింహాచలం భూముల అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు

5 Jul, 2021 19:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వ్యవహారంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్థన్‌లతో కమిటీని నియమించింది. ఈనెల 15లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ఈవో రామచంద్రమోహన్‌ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అడిషనల్‌ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్‌ పనిచేశారు. మాన్సాస్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు