Sangam Barrage: చెప్పాడంటే.. చేస్తాడంతే..

13 Apr, 2022 07:39 IST|Sakshi

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం చేస్తూ జీఓ జారీ  

95 శాతానికి పైగా బ్యారేజీ పనులు పూర్తి

త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభోత్సవం

సంగం బ్యారేజీ.. జిల్లా రైతాంగానికి వరప్రసాదిని. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తన హయాంలో రైతాంగానికి అంకితం చేసేందుకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తపించారు. ఆ కల నెరవేరకుండానే దూరమయ్యారు. సంగం బ్యారేజీకి తన స్నేహితుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా శాసనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

చదవండి: అదుపులోకి విద్యుత్‌ కొరత

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజవర్గంలోని సంగం బ్యారేజీకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం చేస్తూ తెలుగుగంగ చీఫ్‌ ఇంజినీర్‌ ప్రత్యేక జీఓ జారీ చేశారు. ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా శాసనం అయింది. గౌతమ్‌రెడ్డి  ఈ ఏడాది ఫిబ్రవరి 21న అకాల మరణం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అంత్యంత సన్నిహితుడు, సంగం బ్యారేజీ కోసం తపన పడిన గౌతమ్‌రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని భావించారు. చేస్తానని చెప్పాడు.. శాసనసభలో శాసనం చేశాడు. ఈ మేరకు ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తూ మంగళవారం ప్రత్యేక జీఓ 13 జారీ చేశారు.

సంగం బ్యారేజీ నిర్మాణం ఇలా  
సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  2014 లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. టీడీపీ హయాంలో బ్యారేజీ పనులు మందగించాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు  మోక్షం కలిగింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బ్యారేజీ ఉండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

త్వరలోనే సీఎంతో ప్రారంభోత్సవం
సంగం బ్యారేజీ ఇప్పటికే దాదాపు 95 శాతం పూర్తి కావచ్చింది. కాంక్రీట్‌ వర్కు పూర్తి చేశారు. ఇక ఎర్త్‌ వర్క్‌ 3,461 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. సరీ్వస్‌ గేట్స్‌ ఒకటి మాత్రమే పెండింగ్‌లో ఉంది. స్టాఫ్‌ లెగ్‌ గేట్స్‌ పైబ్రిగేషన్‌ పూర్తయింది, ఎరిక్సిన్‌ మాత్రం ఏడు పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డితో  ప్రారం¿ోత్సం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు