Andhra Pradesh: ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు తీపి కబురు

21 Dec, 2021 03:40 IST|Sakshi

2017 పే స్కేల్‌ బకాయిలు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం

యూనియన్ల హర్షం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2019 మార్చి 1 నుంచి, 2021 నవంబర్‌ 30లోగా రిటైరైన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2017– పే స్కేల్‌ బకాయిలను రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత మొత్తాన్ని సోమవారమే వారి ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 5 వేల మందికి ప్రయోజనం కలగనుంది.

త్వరలోనే రెండో విడత బకాయిలను కూడా చెల్లించనుంది. ఈ నిర్ణయంపై ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డీఎస్‌పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. 
(చదవండి: ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి )

మరిన్ని వార్తలు