ఈ ఆర్థిక సాయం వారికి కొండంత అండ!

21 Jun, 2022 11:20 IST|Sakshi

సమగ్ర శిక్ష ప్రాజెక్టులో చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు రూ. 18 లక్షలు ఎక్స్‌గ్రేషియా

చెక్కులను అందజేసిన కలెక్టర్‌ విజయ రామరాజు

కడప సిటీ : విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో అందించే ఆర్థిక సాయం కొండంత బలాన్ని ఇస్తుందని కలెక్టర్, సమగ్ర శిక్ష పథక చైర్మన్‌ వి. విజయ రామరాజు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆరుగురు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 18 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను కలెక్టర్‌ అందజేశారు.  

ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పలు కారణాల చేత విధి నిర్వహణలో ఆరుగురు ఉద్యోగులు చనిపోయారన్నారు. ఇందులో ఇద్దరు యాక్సిడెంటల్‌గా, మరో నలుగురు సహజసిద్ధంగా చనిపోయారన్నారు. సహజ సిద్ధంగా చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, యాక్సిడెంటల్‌ గా మృతిచెందిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందన్నా రు. చెక్కులను బాధిత కుటుంబాలకు ఇచ్చా మన్నారు. జేసీ సాయికాంత్‌ వర్మ, కడప కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్, జిల్లా సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌ రెడ్డి, స్టేట్‌ టీచర్స్‌ యూనియ న్‌ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు