ఏపీ: అంటువ్యాధుల జాబితాలో ‘బ్లాక్‌ ఫంగస్‌’

21 May, 2021 11:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) జబ్బును అంటువ్యాధుల పరిధిలోకి చేర్చుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఎపిడెమిక్‌ డిసీజస్‌ యాక్ట్‌ 1897 ప్రకారం దీన్ని ఈ జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ బారిన పడిన వారు, వ్యాధి నిరోధకత తగ్గిన వారిలోనూ ఇది ఎక్కువగా వస్తోందని, ఏ ఆస్పత్రిలో కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని స్పష్టం చేశారు. తాజాగా ఏపీ ఎపిడెమిక్‌ డిసీజెస్‌ రెగ్యులేషన్‌ 2021 పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ అనుమానితులను తక్షణమే ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు.

చదవండి: AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు 
Ap Budget 2021: సర్వ హితం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు