మరింత పటిష్టంగా.. ‘ఇంటింటికీ రేషన్‌’

9 Apr, 2021 09:07 IST|Sakshi

ప్రతి నెలా రెండు రోజుల వ్యవధిలోనే రేషన్‌ పంపిణీ పూర్తవ్వాలి

మొదటివారంలో పెన్షన్ల పంపిణీకి ఆటంకం లేకుండా ఇది జరగాలి

వలంటీర్లు ఒక రోజు ముందే.. లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలి

ఆ నిర్దేశిత తేదీ, సమయంలోనే రేషన్‌ పంపిణీ చేయించాలి

జేసీలకు ప్రభుత్వం ఆదేశాలు

సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్‌ సరఫరా’ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రెండు రోజుల వ్యవధిలోనే బియ్యం కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర రేషన్‌ సరుకుల పంపిణీని పూర్తిచేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రతి నెలా మొదటి వారంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా రేషన్‌ పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు చూస్తున్న జాయింట్‌ కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.

పంపిణీ సమయంలో వలంటీర్లు ఉండాల్సిందే..
సంబంధిత క్లస్టర్లకు రేషన్‌ పంపిణీ చేసే సంచార వాహనాలు ఏ తేదీన, ఏ సమయానికి వస్తాయో తెలియజేస్తూ.. ఒకరోజు ముందే లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని వలంటీర్లకు సూచించింది. రేషన్‌ పంపిణీ సమయంలో గ్రామ, వార్డు వలంటీర్లు ఉం డి లబ్ధిదారుల బయోమెట్రిక్‌ను తీసుకోవాలని ఆదేశించింది. ఎవరివైనా వేలిముద్రలు పడకపోతే వ లంటీర్లే వేయాలని స్పష్టం చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శులను సంప్రదించి పరిష్కరించాలని వలంటీర్లకు సూచిం చింది.

ఎవరైనా లబ్ధిదారులు రేషన్‌ తీసుకోకపోతే.. ఆ వివరాలను వలంటీర్లు ఏరోజుకారోజు సచివాల యాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల్లోగా తెలి యజేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే.. అక్కడే రేషన్‌ తీసుకునే వెసులుబాటు ఉంద నే విషయంపై వారికి అవగాహన కల్పించాలని ఆదే శించింది. క్లస్టర్‌లో మ్యాపింగ్‌కాని లబ్ధిదారులు.. వారు నివాసం ఉంటున్న క్లస్టర్‌లోనే రేషన్‌ తీసుకోవ చ్చనే విషయాన్నీ వారికి తెలపాలని కోరింది. రేషన్‌ పంపిణీ పూర్తయ్యే వరకు వలంటీర్లు సంచార వాహ నాలతో అందుబాటులో ఉండాలని పేర్కొంది.

లోడింగ్, అన్‌లోడింగ్‌తో సంబంధం లేదు..
వలంటీర్ల సేవలను లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సరుకుల లోడింగ్, అన్‌ లోడింగ్, తదితర కార్యకలాపాలతో వలంటీర్లకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. వీటిని పర్యవేక్షించాలని జేసీలను ఆదేశించింది.
చదవండి:
బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్‌చల్‌ ‌    
పరిషత్‌ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు