ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..

26 Nov, 2020 18:32 IST|Sakshi

53 మంది మహిళా ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి మహిళా జైలు నుండి 19 మంది, కడప 27, నెల్లూరు 5, విశాఖపట్నం నుంచి ఇద్దరు విడుదలకు రంగం సిద్ధమైంది. విడుదలకు ఏపీ సర్కార్‌ కొన్ని షరతులు విధించింది. రూ. 50 వేల రూపాయల పూచీకత్తు బాండ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.శిక్ష కాల పరిమితి ముగిసేవరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదల రద్దు చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్‌)
(చదవండి: 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు)

మరిన్ని వార్తలు