విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి

14 May, 2021 08:49 IST|Sakshi

 విమానాశ్రయాలకు క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

దీని ప్రకారం కోవిడ్‌ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలి. మిగిలిన వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.

చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’   
కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు