అచ్యుతాపురం గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై విచారణ కమిటీ

4 Jun, 2022 14:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ కమిటీని నియమిస్తూ పీసీబీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు అధికారులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా అనకాపల్లి జాయింట్‌ కలెక్టర్, పీసీబీ జేఈఈ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫాక్టరీస్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించింది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్‌ఈజెడ్‌) లోని బ్రాండిక్స్‌ అపరెల్‌ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు.

మరిన్ని వార్తలు