ఏపీ: ఆరోగ్య భృతి ఉత్తర్వులు జారీ.. 43 వేలమంది కార్మికులకు మేలు

23 Jul, 2022 13:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూ. 6 వేలు చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను చెల్లించనునుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది. తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. 

పలు డిమాండ్లతో పాటు ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ.. సమ్మెకు దిఆరు పట్టణ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు. ఈ తరుణంలో సీఎం జగన్‌ సమస్యలను తెల్చుకుని వెంటనే పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్‌ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పరిష్కారం అయ్యాయి. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్‌. 

చదవండి: టీడీపీ హయాంలో తక్కువ.. సంక్షేమమే వైఎ‍స్సార్‌సీపీ ధ్యేయం

మరిన్ని వార్తలు