కోవిడ్‌ వైద్య సేవలు: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం...

27 Apr, 2021 14:11 IST|Sakshi

40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు

నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను గుర్తిస్తున్న అధికారులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వైద్య సేవల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రోజుకు 12వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. కాగా, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణకు ఆది నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్‌ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రై వేట్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద మంచి వైద్యం, ఆక్సిజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం లాంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి చూడడం, కోవిడ్‌ రోగులకు పడకల కేటాయింపు, 104 కాల్‌సెంటర్‌ ద్వారా ఆశిస్తున్న సేవలు అందుతున్నాయా? లేదో పర్యవేక్షించడం, ఎక్కడా లోపాలు లేకుండా చేసేందుకు తాజాగా మూడంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

చదవండి: వారికి తక్షణమే పరిష్కారం చూపాలి: సీఎం జగన్‌
కోవిడ్‌ కట్టడికి త్రిముఖ వ్యూహం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు