పెరుగనున్న బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

12 Nov, 2020 14:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (బుడా) పరిధి పెరగనుంది. బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 6 మండలాల్లోని 169 పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బొబ్బిలి అర్బన్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు విజయనగరం జిల్లాలోని 11 మండలాల్లోని 572 గ్రామాలు ఉన్నాయి. చదవండి: 'వైఎస్ఆర్ చేయూత' రెండో విడత ప్రారంభం

కొత్తగా బుడా పరిధిలోకి తెర్లా, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి గ్రామాలు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 833 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో 3080 చదరపు కిలో మీటర్లు బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెరగనుంది. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు