దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్‌ వాహనం

10 Oct, 2022 07:38 IST|Sakshi

ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు

ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్‌ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్‌ సిటిజన్స్‌ సహకార సంస్థ (ఏపీడీఏఎస్‌సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి.

లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. జిల్లా మెడికల్‌ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు, ఎస్‌ఎస్‌సీ ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్‌సీఏసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

ఇదీ చదవండి: జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా'

మరిన్ని వార్తలు