ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం

14 Dec, 2020 05:08 IST|Sakshi
ఏలూరులో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న మంత్రి ఆళ్ల నాని

650 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

బాధిత ప్రాంతాల్లో మంత్రి ఆళ్ల నాని పర్యటన

ఏలూరు టౌన్‌: ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం బారిన పడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైద్య చికిత్సల అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన బాధితులను ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదివారం పరామర్శించారు. శనివారం తంగెళ్లమూడిలోని శివగోపాలపురం, యాదవనగర్‌ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఇళ్లవద్దే పరామర్శించిన మంత్రి.. ఆదివారం ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలో పర్యటించి బాధితుల ఆరోగ్యస్థితి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి స్వయంగా నిత్యావసర సరుకులు అందజేశారు. కాగా, ఏలూరులో మొత్తం 650 బాధిత కుటుంబాలకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు