కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది: ఏపీ వైద్యారోగ్య శాఖ

21 Dec, 2022 18:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ నడుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ బుధవారం వెల్లడించారు. 

నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయి. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి అని ఆయన వెల్లడించారు. 

దేశంలో చైనా నుంచి వచ్చిన కొత్త వేరియెంట్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. ఈ నేపథ్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు