వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

16 May, 2021 23:24 IST|Sakshi

కరోనా మృతుల అంత్యక్రియలపై సీఎం జగన్ నిర్ణయం 

 ఆర్థికసాయంపై కలెక్టర్లకు అధికారాలు 

 2021-22 ఏడాదికి వర్తించేలా నిర్ణయం 

 ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.

( చదవండి: విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు