సీజనల్‌ వ్యాధులపై అధికారులతో ఆళ్ల నాని సమీక్ష

6 Sep, 2021 18:16 IST|Sakshi

సాక్షి, గుంటూరు: సీజనల్ వ్యాధులపై ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ..  ‘‘ప్రభుత్వం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంది. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి’’ అన్నారు.

‘‘జ్వరాలకు సంబంధించిన సర్వే చేయాలి. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వ్యాధులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో జ్వరాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జ్వరాల ట్రీట్మెంట్‌కి సంబంధించిన స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి’’ అని ఆళ్ల నాని సూచించారు. (చదవండి: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: ఏపీ సర్కార్‌ ముందస్తు ప్రణాళిక)

‘‘మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఆళ్ల నాని తెలిపారు.

చదవండి: పకడ్బందీ ప్రణాళికతో కరోనాకు చెక్‌

మరిన్ని వార్తలు