ఏపీలో యాక్టీవ్‌ కేసులు లక్షలోపుకు చేరాయి: అనిల్‌ కుమార్‌

11 Jun, 2021 18:55 IST|Sakshi

సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేట్ 8.09 శాతంగా ఉంది అని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 202 ఆస్పత్రులకు కరోనా చికిత్స నుంచి డీ-నోటిఫై చేశాం. గతంలో కరోనా ఆస్పత్రుల సంఖ్య 625గా ఉంటే.. ఇప్పుడవి 423కి తగ్గాయి. విదేశాల్లో చదివే విద్యార్ధులకు, ఐదేళ్ల లోపు తల్లులకు సుమారుగా 1.29 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశాం. 45 ఏళ్ల పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సినేషన్ వేశాం’’ అని అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 1307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు 138 మంది చనిపోయారు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే కేంద్రం ఇచ్చే యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు తగ్గుతాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే నష్టమే.. ఆ పని ప్రభుత్వం చేయదు. కేంద్రం నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ రెండు రోజుల్లో పూర్తి చేసేస్తున్నాం. పది లక్షల కరోనా డోసులు ఇస్తోంటే ప్రత్యేక కార్యాచరణ అవసరం’’ అన్నారు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.

చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు

మరిన్ని వార్తలు