నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఏపీ హైకోర్టు

31 Aug, 2021 16:49 IST|Sakshi

అమరావతి: కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. క్యాబినెట్ మంత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని.. పార్టీలుగా చేసి అందరికీ నోటీసులు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. కాగా పిటిషనర్ వాదనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.

చదవండి: కూన రవిపై ప్రివిలేజ్‌ కమిటీ ఆగ్రహం

క్యాబినెట్ మంత్రులకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి వింటామన్న హైకోర్టు.. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు అనుగుణంగానే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది.

చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

మరిన్ని వార్తలు