ఏపీ: అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

23 Jul, 2021 14:49 IST|Sakshi

పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: తాడేపల్లి అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 245 మందికి స్థలాలు కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు నష్ట పరిహారం కూడా చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇళ్లు ఖాళీ చేసేందుకు పిటిషనర్లు రెండు నెలలు సమయం కోరగా, వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు