సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ

3 Nov, 2021 05:41 IST|Sakshi

పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు సరైన దిశలో సాగుతుందని రుజువు చేసుకోండి

లేకపోతే సీబీఐ సరిగా దర్యాప్తు చేయలేకపోతుందని ప్రకటిస్తాం

దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తాం

ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరతాం

సీబీఐకి తేల్చిచెప్పిన హైకోర్టు

విచారణ 22కి వాయిదా

సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికీ న్యాయమూ ర్తులను కించప రుస్తూ పోస్టులు పెడుతున్న పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్‌ చేసి తీరాల్సిందేనని సీబీఐకి తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువు నిస్తున్నట్లు తెలిపింది. తద్వారా దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని రుజువు చేసుకోవాలని సీబీఐకి స్పష్టం చేసింది. లేని పక్షంలో సీబీఐ ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేకపోతోందని పేర్కొంటూ, దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగిస్తామని మౌఖికంగా చెప్పింది.

ఈ మొత్తం కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరుతామంది. 2020 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయనున్నారో తెలియ చేస్తూ ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ గతేడాది పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

చానెల్‌ను బ్లాక్‌ చేయడం వల్ల ఉపయోగం ఉండదు..
ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫు న్యాయ వాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు విని పిస్తూ.. పంచ్‌ ప్రభాకర్‌ యూట్యూబ్‌ చానెల్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు అతడి పోస్టులను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి తొలగిం చారని తెలిపారు. యూట్యూబ్‌ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారు.  ఫేస్‌బుక్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌ వాదనలు వినిపిస్తూ.. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) ద్వారా వీడియోలను వీక్షిస్తున్నారని.. ఇలా చేయ డం చట్టవిరుద్ధమని తెలిపారు. యూఆర్‌ఎల్‌ వివరాలు ఇస్తే 36 గంటల్లో పోస్టులను తొలగిస్తామ న్నారు.

ధర్మాసనం స్పందిస్తూ కేసు నమోదు చేసిన వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ కంపెనీలపై ఉందం ది.  సీబీఐ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌ వాదనలు వినిపిస్తూ.. వీడియోల తొలగిం పునకు గూగుల్‌కు లేఖ రాశామన్నారు. పంచ్‌ ప్రభాకర్‌ విషయంలో ఇప్పటికే రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. అతడి అరెస్ట్‌ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ సాయం కూడా తీసుకుం టున్నామన్నారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తాము ఏమీ చేయడం లేదనడం ఎంత మాత్రం సరికాదన్నారు. 

మరిన్ని వార్తలు