ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

10 Aug, 2021 21:48 IST|Sakshi

అమరావతి: ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. bie.ap.gov.inలో ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం apoasis అనే మొబైల్‌ అప్లికేషన్‌ రూపకల్పన చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు సులువుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కాగా విద్యార్ధులు ఎటువంటి ఒరిజనల్ సర్టిఫికేట్స్ కళాశాలలకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది.

ధరఖాస్తు సమయంలో కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రతీ కాలేజ్‌లో.. ప్రతీ జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు, ఇంటర్ రెండు సంవత్సరాలతో పాటు వొకేషనల్ విద్యార్ధులకి ఆన్  లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించారు. ధరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకి రూ.100, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌లకి రూ. 50గా నిర్ణయించారు. విద్యార్దుల సందేహాలకి టోల్ ఫ్రీ నంబర్ 18002749868 కాల్‌ చేయాల్సిందిగా సూచించారు. నెలాఖరు లోపు ధరఖాస్తులని పరిశీలించి విద్యార్ధులకి అడ్మిషన్ లెటర్స్ పంపనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

మరిన్ని వార్తలు