సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

3 Aug, 2021 20:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్‌ సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్టు పేర్కొంది.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు