AP: నేడు ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల

23 Oct, 2021 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బో ర్డు ఇన్‌చార్జ్జ్‌ కార్యదర్శి వి. రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది.

వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రామకృష్ణ పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 9391282578 వాట్సాప్‌ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.  

28 నుంచి 30 వరకు సీపీటీ టెస్టు 
సాక్షి, అమరావతి: వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కారుణ్య నియామక గ్రేడ్‌–2 వీఆర్వోలు తదితరులకు కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ) ఈనెల 28వ తేదీనుంచి 30వ తేదీ వరకు జరుగుతుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను ‘   https://psc.ap. gov.in' నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.  

ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాలు.. 
www.sakshieducation.com
https:bie.ap.gov.in
https://examresults.ap.nic.in
https://results.apcfss.in

మరిన్ని వార్తలు