‘జీఓ 23ను యధావిధిగా కొనసాగించాలని‌ కోరుతున్నాం’

2 Nov, 2020 13:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 23కు ఏపీ జూనియర్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ మద్దతు పలికింది. తొమ్మిది సెక్షన్లతో పాటు సెక్షన్‌కు 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఏపీ జేఎంసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, తదితరులు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణను కలిశారు. అనంతరం ఆన్‌లైన్‌ అడ్మిషన్లు కొనసాగించాలని వినతి చేశారు. ఈ సందర్భంగా గుండా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 23కు రాష్డ్ర వ్యాప్తంగా నాన్ కార్పోరేట్ జూనియర్ కళాశాలల తరపున మద్దతు పలుకుతున్నామన్నారు. జీఓ 23ను యధావిధిగా ప్రభుత్వం కొనసాగించాలని‌ కోరారు. చదవండి: ఆన్‌ లైన్‌తో  ‘ప్రయివేట్‌’ అక్రమాలకు అడ్డుకట్ట

‘జీఓ నెంబర్ 23 అమలుచేయాలని హైకోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. కొన్ని‌ కార్పోరేట్ కళాశాలలు జీఓ23నుని అడ్డుకోవడానికి కుట్రలతో కోర్టుని ఆశ్రయించాయి. ఇంటర్ విద్యలో కార్పోరేట్ ఆధిపత్యం తొలగిపోవాలి. విద్యార్థుల తల్లితండ్రులు కార్పొరేట్ కళాశాలల మాయమాటలు నుంచి బయటపడాలి. జీ+3 జూనియర్ కళాశాలల భవనాలకి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం 60 రోజుల సమయమివ్వడానికి కమిషనర్ ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ఆయా కళాశాలలు అడ్మిషన్లు‌ నిర్వహించుకోవడానికి ఇంటర్ మీడియట్ బోర్డు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇంటర్ ఫీజు 3119 రూపాయిలు మాత్రమే ఉంది. ఈ ఫీజుని‌ సవరించాలని‌ కోరాం. కనీసం 25 వేల నుంచి 40 వేల వరకు పెంచాలని కోరాం. ఆన్‌లైన్‌ అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యలో సమూల‌ మార్పులకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. అని పేర్కొన్నారు. చదవండి: అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే

మరిన్ని వార్తలు