ఏపీ లాసెట్‌, ఎడ్‌సెట్‌- 2022 ఫలితాలు విడుదల

5 Aug, 2022 18:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్‌- 2022 ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్, పీజీఎల్ సెట్, ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. లాసెట్‌ ఫలితాల్లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు సాధించి మహిళలు సత్తా చాటారు.

ఏపీ ఎడ్సెట్ ఫలితాలు 
బైలాజికల్ సైన్‌లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఓరం అమర్‌నాథ్‌ రెడ్డికి మొదటి ర్యాంకు.

► మాథమ్యాటిక్స్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్ కుమార్ రెడ్డికి తొలి ర్యాంకు.

► ఇంగ్లీష్‌లో కేరళ రాష్టానికి చెందిన అంజనాకు మొదటి ర్యాంకు. 

► సోషల్ స్టడీస్‌లో నంద్యాల జిల్లాకు చెందిన ఏ శివానీకి మొదటి ర్యాంకు.

► ఫిజికల్ సైన్స్‌లో విజయనగరం జిల్లాకు చెందిన కె.వాణికి మొదటి ర్యాంకు.

ఏపీ లాసెట్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు..  
ఏపీ లాసెట్‌ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బి.కీర్తికి లాసెట్ 5 ఇయర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు మహిళలకే దక్కాయి.

ఇదీ చదవండి: పాఠం స్కాన్‌ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు

మరిన్ని వార్తలు