30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

26 Nov, 2020 17:43 IST|Sakshi

అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై నోటిఫికేషన్‌ విడుదల

డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు  సమావేశాలపై నోటిఫికేషన్‌ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్‌)

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితమైంది. ఇకపై  గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.(చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం)

మరిన్ని వార్తలు