నదుల అనుసంధానంపై నేల విడిచి నీటి వ్రాలు

29 Apr, 2021 06:14 IST|Sakshi

మహానది–గోదావరి అనుసంధానం డీపీఆర్‌లో పొంతన లేని లెక్కలు

జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థకు ఏపీ లేఖ 

నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, ఎన్‌ఐహెచ్‌ లెక్కలకు పొంతన లేదు

పోలవరం, వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే అనుసంధానం ద్వారా నీళ్లందిస్తే ప్రయోజనం ఏమిటని నిలదీత

ఒడిశాలో రెండు పంటలకు.. ఏపీలో ఒక్క పంటకే నీళ్లిస్తామనడంపై అభ్యంతరం

సాక్షి, అమరావతి: మహానది–గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్న గణాంకాలు అస త్యాలతో (నీటి వ్రాలు) కూడుకుని ఉన్నాయని ఏపీ జల వనరుల శాఖ తేల్చి చెప్పింది. నీటి లభ్యతపై స్పష్టత లేదంటూ జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు లేఖ రాసింది. ఈ విషయంలో కచ్చితమైన అంచనా లేకుండా.. ఏ సమ యంలో నీటిని మళ్లించాలనే దానిపై స్పష్టత లేకుం డా.. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత ఆయకట్టుకు నీళ్లందిస్తారనేది తేల్చకుండా డీపీఆర్‌ రూపొందించడాన్ని ఎత్తిచూపింది. గోదావరిలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ వరద ప్రవాహం ఉంటుందని.. ఆ సమయంలో మహానది నుంచి గోదావరికి నీటిని మళ్లిస్తే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేయడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండ దని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌సింగ్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఇటీవల లేఖ రాశారు. దేశంలో హిమాలయ నదులను, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడంలో భాగంగా గంగా–మహానది–గోదావరి–కష్ణా–కావేరీ అనుసం« దానంపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మహానది (బర్ముల్‌)–గోదావరి (ధవ ళేశ్వరం బ్యారేజీ) అనుసంధానంపై నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్‌)తో కలిసి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన డీపీఆర్‌పై అభి ప్రాయాలు చెప్పాలని ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించింది.

అనుసంధాన ప్రతిపాదన ఇదీ
ఒడిశాలో బర్ముల్‌ వద్ద 75 శాతం నీటి లభ్యత ఆధా రంగా మహానదిలో 1,733.95 టీఎంసీలు ఉంటా యని.. ఇందులో వరద కాలం పూర్తయ్యాక పున రుత్పత్తి ద్వారానే 910.46 టీఎంసీల లభ్యత ఉం టుందని ఎన్‌ఐహెచ్‌ అంచనా వేసింది. ఎన్‌ఐహెచ్‌ నివేదిక ఆధారంగా బర్ముల్‌ వద్ద మహానదిపై బ్యారేజీ నిర్మించి.. 356.84 టీఎంసీలను మళ్లించా లని పేర్కొంది. ఈ నీటిలో 178.65 టీఎంసీలను ఒడిశా సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాలని.. మిగతా 178.19 టీఎంసీలను గోదా వరికి మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.మానస్‌–సంకోష్‌–తీస్తా–గంగా–మహానది అ నుసంధానం తర్వాత మరో 51.34 టీఎంసీలతో కలిపి మొత్తం 229.53 టీఎంసీలను గోదావరిలోకి మళ్లించేలా డీపీఆర్‌ను రూపొందించింది. బర్ముల్‌ నుంచి ఒడిశాలో నయాఘర్, కుర్దా, గంజాం, గజ పతి జిల్లాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా 844.595 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వాలని పేర్కొంది. ఈ కాలువ ద్వారా మహానది జలాలను తొర్రిగెడ్డ డ్రెయిన్‌లోకి తరలించి.. ధవళేశ్వరం బ్యారేజీకి 17 కిలోమీటర్ల ఎగువన సీతానగరం వద్ద గోదావరిలో కలపాలని ప్రతిపాదించింది. ఒడిశాకు కేటాయించిన 178.65 టీఎంసీల నీటిని 3.51 లక్షల హెక్టార్లకు అందించాలని పేర్కొంది. ఏపీకి కేటా యించిన 21.39 టీఎంసీలతో  91,110 హెక్టార్లకు నీళ్లందించి.. మిగతా 208.14 టీఎంసీలను కావేరి నదికి మళ్లించేలా డీపీఆర్‌ను సిద్ధం చేసింది.

ఆ రెండు లెక్కలపై పొంతన ఏదీ!
మహానదిలో నీటి లభ్యతపై ఎన్‌ఐహెచ్, ఎన్‌ డబ్ల్యూడీఏ వేర్వేరుగా రూపొందించిన అంచనాలకు పొంతన కుదరకపోవడాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తి చూపింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బర్ము ల్‌ వద్ద మహానదిలో సహజసిద్ధ ప్రవాహం రూపం లో కేవలం 123.528 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క గట్టిందని గుర్తు చేసింది. సాధారణంగా సహజసిద్ధ ప్రవాహం 20 శాతం మాత్రమే పునరుత్పత్తి (రీజనరేషన్‌) ద్వారా వస్తాయని అంటే.. పునరుత్పత్తి ద్వారా వచ్చే జలాలు 12.35 టీఎంసీలకు మించవని స్పష్టం చేసింది. కానీ.. ఎన్‌ఐహెచ్‌ మాత్రం పునరుత్పత్తి ద్వారా 910.46 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిందని, ఆ స్థాయిలో లభ్యత ఎలా ఉంటుందో వివరణ ఇవ్వాలని కోరింది.

ఆ ఆయకట్టుకే నీళ్లిస్తే ఏం ప్రయోజనం!
మానస్‌–సంకోష్‌–తీస్తా–గంగా–మహానది అనుసంధానం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని ఏపీ ప్రభుత్వం కుండబద్ధలు కొట్టింది. మహానది–గోదావరి నదుల అనుసంధానానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొన్న మేరకు ప్రధాన కాలువ వంశధార, తోటపల్లి, పోలవరం ఆయకట్టు ద్వారా వెళ్తుందని తెలిపింది. ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకే మహానది–గోదావరి నదుల అనుసంధానం ద్వారా నీళ్లందిస్తే ప్రయోజనమని ఏమిటని ప్రశ్నించింది. ఒడిశాలోని ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లందించాలని ప్రతిపాదించారని, ఏపీలో మాత్రం ఒక పంటకే నీళ్లివ్వాలని డీపీఆర్‌లో పేర్కొనడాన్ని తప్పు పట్టింది.  

మరిన్ని వార్తలు