మద్యం బ్రాండ్‌లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్‌ కింగ్‌  చంద్రబాబే..!

16 Dec, 2022 13:33 IST|Sakshi

మెజార్టీ డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే

40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. అయినా.. వీటన్నింటిని మరిచి ఈ మధ్య మళ్లీ మద్యం పాట పాడుతున్నారు చంద్రబాబు. మనసుకు నిజం తెలిసినా.. ఆయన నోటి నుంచి అబద్దాలే వస్తున్నాయి.

ఎక్కడా లేని బ్రాండ్‌లు ఏపీలో ఉన్నాయంటూ ప్రచారంలో ప్రజలకు చెప్పుకొస్తున్నారు. కొత్త బ్రాండ్లతో నాసిరకం మద్యం అమ్ముతున్నారని తెగ జాలి ప్రదర్శిస్తున్న చంద్రబాబు.. లిక్కర్‌ షాపుల్లో డిజిటల్‌ పేమేంట్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు వాదనలో నిజమెంత ఉంది? ఒక సారి కింది ట్యాలీని పరిశీలిద్దాం.

మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.  "నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వం చేపట్టిక సంక్షేమ కార్యక్రమాలు, ఇవే మా ప్రభుత్వ బ్రాండ్లు. అయితే చంద్రబాబు బ్రాండ్‌ లిక్కర్‌లో ఉంది. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌ భూంభూం బీర్‌, పవర్‌ స్టార్‌ 999, 999 లెజెండ్‌.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే.

ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌.. చంద్రబాబు మెడల్‌ బ్రాండ్‌. గవర్నర్‌ ఛాయిస్‌ 2018, నవంబర్‌ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్‌ బ్రాండ్‌లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ చంద్రబాబు ట్రేడ్‌ మార్క్‌ బ్రాండ్లు"

చేసిందంతా చేసి.. ఇప్పుడు బ్రాండ్ల గురించి మళ్లీ ప్రజల ముందు ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ఎంత ఘనంగా ప్రచారం  చేసినా మాకంత తెలుసులే అనుకుంటున్నారు జనం.
చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు..

మరిన్ని వార్తలు