AP Madhavaram Village: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ.. దేశంలోనే వెరీ స్పెషల్‌

24 Jul, 2022 10:48 IST|Sakshi

తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్‌లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్‌ కల్నల్స్‌ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అసోసియేషన్‌ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్‌ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అసోసి­యేషన్‌ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. 

దేశంలోనే రెండో స్థానం.. 
మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్‌ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్‌ మెమోరియల్‌ ఢిల్లీలో ఇండియా గేట్‌ 
దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది.

ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు

మరిన్ని వార్తలు