నాగబాబు ట్వీట్‌కు అంబటి కౌంటర్.. నువ్వు, మీ తమ్ముడిలా ముఖానికి రంగు వేసుకోను

16 Jan, 2023 12:16 IST|Sakshi

తాడేపల్లి: సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నువ్వు, మీ తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నట్లు తాను సంబరాల రాంబాబునేనని, కానీ ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయను అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

సంక్రాంతిని పురస్కరించుకుని భోగి వేడుకల్లో భాగంగా స్థానికులను ఉత్తేజ పరిచేందుకు అంబటి డాన్స్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే నాగబాబు దీనిపై వ్యంగ్యంగా స్పందించగా.. అంబటి తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు