ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నాం: మంత్రి అనిల్‌

28 Jun, 2021 16:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని జల వనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో అదే తాము ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటిమట్టం రాక ముందే తెలంగాణ రాష్ట్ర అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు.

‘చంద్రబాబు మతిభ్రమించినట్లే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలకు మతి భ్రమించి  ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తున్నారు. నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్ మీటింగ్‌లకు  పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు.  రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు.

చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

మరిన్ని వార్తలు