రోగులకు బెడ్‌ లేదనే సమాధానం రాదు: మంత్రి అవంతి

13 May, 2021 14:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం: రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించార. సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారాలకు కల్పించినట్లు గుర్తుచేశారు. ఆక్సిజెన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

కరోనా వైరస్‌పై గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘1,443 ఆరోగ్య శ్రీ బెడ్‌లు ఉండగా వీటిని పెంచే యోచనలో ఉన్నాం. హెల్త్ కేర్ వర్కర్స్  అందరికీ పీపీ కిట్‌, ఎన్-95 మాస్కులు అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలి. కేంద్రం నుంచి దశల వారీగా వ్యాక్సిన్ వస్తోంది. అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. జిల్లాలో 46 వేల మంది ఇటీవల కోవిడ్‌తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వ్యక్తులు కోలుకుంటున్నారు.’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు.

చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్‌ కొరత లేదు

చదవండి: ‘కోవిషీల్డ్’ డోసులలో కీలక మార్పులు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు