బానిస అనక బాహుబలి అనాలా?.. పవన్‌పై మంత్రి అమర్నాథ్‌ సెటైర్లు

13 Jan, 2023 08:36 IST|Sakshi

సాక్షి,  తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వరుసగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్‌ చేశారాయన. 

‘‘ఐటీ శాఖ మంత్రి పేరు నీకు తెలియదు. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా?.. గుర్తుపెట్టుకోవాలి కదా!. బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు నీకు గుర్తుండదేమో?’’ అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ. 

‘కాపుల కులాన్నంతా మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేద్దామనే ఆలోచన ఏమో నీది. వైఎస్ఆర్‌సీపీ తప్ప  బీజేపీ , సీపీఐ,  సీపీఎం , బీఎస్పీ తో పాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్. ఈసారి నీ  బెండు తీయడం ఖాయం. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసేసుకో.. ఇవ్వాల్సిన అందరికీ భరణాలు ఇచ్చేసేయ్’ అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్‌. ముత్తైదువులను  పక్కన కూర్చోబెట్టుకుంటావు అందులోకి ఒక వెన్నుపోటు దారుడు ఉంటాడు అంటూ పరోక్షంగా బాబుపై సెటైర్‌ సంధించారు.

పవన్ కల్యాణ్ ను రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు చెప్పమనండి. నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన ప్రజా మోద కార్యక్రమాల వల్ల 2024లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. అంతకు పవన్‌ తీరును ఎండగడుతూ ట్విటర్‌లో మంత్రి గుడివాడ ట్వీట్లు చేశారు.

మరిన్ని వార్తలు