హింసను ప్రేరేపించే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.. జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయం! : మంత్రి జోగి రమేష్‌

19 Dec, 2022 14:37 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరుపై మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్‌. పవన్‌ను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమేనని దుయ్యబట్టారు. సోమవారం మీడియా సమావేశంలో పవన్‌, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేశ్‌. 

‘పవన్‌ విజిటింగ్‌ వీసా మీద వచ్చి ఏదో వాగిపోయాడు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా? జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్‌. ఆయనను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయం. పవన్‌కు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమే. నోటికొచ్చినట్లు మాట్లాడటం, రెచ్చగొట్టడమే పవన్‌కు తెలుసు. హింసను ప్రేరేపించే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ ’ అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్‌. 

ఇదీ చదవండి: ‘చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడింది’

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు