మీకేదైనా ఉంటే మీ రాష్ట్రంలో తేల్చుకోండి: మంత్రి మేరుగు నాగార్జున

30 Sep, 2022 17:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్‌ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున. మీకేదైనా ఉంటే మీ రాష్ట్రంలో తేల్చుకోండని, మా ప్రభుత్వం, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని తేల్చి చెప్పారు. హరీష్‌ రావు దుష్టచతుష్టయం చెందన చేరారని, రామోజీ రావు, రాధాకృష్ణలకు అమ్ముడు పోయారని ఆరోపించారు.  

‘వాళ్ళ మామకి ఆయనకి ఏమైనా విభేదాలు ఉన్నాయేమో మాకు తెలియదు. బుల్లెట్ ఒకరికి గురిపెడితే వేరే వారికి తగులుతుంది అనుకుంటున్నారేమో.  హరీష్ రావు దుష్ట చతుష్టయం చెంతన చేరాడు. రామోజీ, రాధాకృష్ణకు అమ్ముడు పోయాడు. మీకేదైనా ఉంటే మీ రాష్ట్రంలో తేల్చుకోండి. మా ప్రభుత్వం, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అన్నీ రాష్ట్రాలకు మా రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తోంది. మీతో చెప్పించుకునే దుర్గతి మాకు లేదు. మా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై మీకెందుకు? మేము విద్యావ్యవస్థను ఏ విధంగా అభివృద్ది చేస్తున్నామో దేశమంతా చూస్తోంది. రాబోయే రోజుల్లో మా టీచర్లకు ఇంకా మంచి జరగనుంది. ఈయన వాఖ్యలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని నేను అనుకోను. కేసీఆర్ ఆలా ఆలోచిస్తారని నేనైతే అనుకోను. మేము ఏ రోజు కేసీఆర్... చివరికి హరీష్ రావు గురించి కూడా మాట్లాడలేదు. వాళ్ళ రాష్ట్రము బాగుండాలి... మా రాష్ట్రము బాగుండాలని మేము కోరుకుంటాం. నిన్నటి వరకూ వారితో కలిసే బతికాం... అందరం బాగుండాలనేది మా ఆశ.’ అని పేర్కొన్నారు మంత్రి మేరుగు నాగార్జున. 

ఇదీ చదవండి: కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్‌

మరిన్ని వార్తలు