జీఐఎస్‌ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్‌ బ్లాంక్‌: మంత్రి రోజా

7 Mar, 2023 17:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌ బ్రాండ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌తో అర్థమైందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జీఐఎస్‌ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నారు. ‘‘రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. టీడీపీ గోబెల్స్‌ ప్రచారానికి ఈ సమ్మిట్‌తో సమాధానమిచ్చాం’’ అని రోజా అన్నారు.

పర్యాటక శాఖలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. గ్రౌండింగ్‌ చేయడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. పారిశ్రామిక దిగ్గజాలు రావడం ఈ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్‌కి నిదర్శనం. అంబానీ, ఆదాని, దాల్మియా, జిందాల్ వంటి నేతలు సీఎం జగన్ పాలన కోసం చెప్పారు. సీఎం జగన్‌ పట్ల ఎంత విశ్వాసం ఉందో ఈ సమ్మిట్‌తో అర్థమైంది’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘మా టూరిజం శాఖలో ఎంవోయూలు గ్రౌండ్ చేయడానికి రెండు కమిటీలు వేశాం. పర్యాటక శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం  ఎంవోయూలు చేశాం. ఒబేరాయ్ లాంటి సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఏనాడైనా ఇంత గొప్ప పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు హయాంలో సమ్మిట్‌లకు వచ్చారా?. చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబుకి అర్థమైంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
చదవండి: స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్‌


 

మరిన్ని వార్తలు