అది వారాహి కాదు.. నారాహి: మంత్రి రోజా సెటైర్లు

10 Dec, 2022 13:57 IST|Sakshi

సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఖరిపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కత్తులు పట్టుకుని పిచ్చి పిచ్చి చేస్తున్నారంటూ పవన్‌పై మండిపడ్డారామె. నగరంలో ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధి పై ఇన్సట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ITPI) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభాగం, ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సమావేశానికి ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రచార వాహనంపై ఆమె సెటైర్లు వేశారు. 

‘‘అది వారాహి కాదు నారాహి. కత్తులు పట్టుకుని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం రాజకీయాల్లో సరైన పద్దతి కాదు. ఆయన ఎన్నికల ప్రచార వాహనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆయన అనుకూల మీడియానే హైలెట్ చేసింది. అయినా  నిబంధనల ప్రకారం..  ఆర్మీ వాళ్ళు మాత్రమే పచ్చ రంగు కలర్ వాహనాన్ని వాడాలని నిబంధన ఉంద’’ని ఆమె జనసేన నేతకు గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు