‘తేడా వస్తే దబిడిదిబిడే’.. బాలకృష్ణకు మంత్రి కారుమూరి కౌంటర్‌

25 Sep, 2022 11:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: హెల్త్‌ వర్సిటీకి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ‘చూడు బాలయ్య.... నీ కన్న తండ్రి ఎన్టీఆర్‌ గారి మీద వైశ్రాయ్‌ హోటల్‌ ముందు నీ బావ చంద్రుబాబు చెప్పుల వర్షం కురిపిస్తుంటే నువ్వు మందు తాగుతూ ఎంజాయ్‌ చేశావు. ఎన్టీఆర్‌ గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది.. అదే ఎన్టీఆర్‌ పేరు కృష్ణా జిల్లాకు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానిది’ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

రీల్‌ సింహం కాదు రియల్‌ సింహం.. 
బాలకృష్ణ ట్వీట్‌కి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. ‘ బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్‌ ముందు కాదు.. అసెంబ్లీలో అంత క్లియర్‌గా చెప్పాకా కూడా వైలెన్స్‌ చేయాలి అనుకుంటే.. అక్కడ ఉన్నది రీల్‌ సింహం కాదు రియల్‌ సింహం జగన్‌... తేడా వస్తే మీ బావ, బామ్మర్దులకు దబిడిదిబిడే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి.

ఇదీ చదవండి: బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జ‌గ‌నన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్‌

మరిన్ని వార్తలు